'తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పరచాలి'

'తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పరచాలి'

GNTR: తెనాలి పట్టణంలో మున్సిపల్ ఆరోగ్యాధికారి ఎం. యేసుబాబు గురువారం పర్యటించారు. పలు వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా, కాలువల్లో పేరుకుపోయిన మురుగును తక్షణమే తొలగించాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.