హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

PLD: రెంటచింతల మండలంలోని వైఆర్‌ఎస్ హైస్కూల్‌ను కలెక్టర్ అరుణ్‌బాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి జ్ఞానం, పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. తరగతి గదులను, హాజరు పట్టికలను, బోధన పద్ధతులను పరిశీలించి,ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం విద్యా ప్రమాణాల మెరుగుదలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.