ఎమ్మెల్యేపై సర్పంచ్ ఆగ్రహం
RR: చెవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై గ్రామ సర్పంచ్ మంగళారం యాదయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామంలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ముందస్తు సమాచారం లేకుండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు.