VIDEO: ఎన్నికల ప్రచారంలో మాజీ MLAకు చుక్కెదురు
MNCL: కన్నెపల్లి మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ MLA దుర్గం చిన్నయ్యపై గ్రామ ప్రజలు తిరగబడ్డారు. గత పది ఏళ్ళు MLAగా పరిపాలన చేసి మండలంను ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. పదేళ్లు మండలాన్ని అభివృద్ధి చేయకుండా తమ సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ప్రచారానికి ఎలా వచ్చారని గ్రామస్థులు నిలదీశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.