'అందుకే చమురు కొనుగోలుకు అనుమతి'

'అందుకే చమురు కొనుగోలుకు అనుమతి'

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయమని గతంలో ట్రంప్ చెప్పిన వెంటనే భారత్ ఆపేసిందని కరోలిన్ తెలిపారు. అందుకే వారికి అవసరం ఉన్న సమయంలో ఇబ్బందిపెట్టకుండా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.