మహాత్మా గాంధీకి ఘన నివాళులు

VZM: బొండపల్లి మండలంలోని చామలవలస గ్రామంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీజీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఆర్యవైశ్య మండల శాఖ అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూసర్ల కృష్ణ, కట్టమూరి సత్యనారాయణ, ఉప్పల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.