మదనపల్లె పీఎస్‌లో రాధాకృష్ణపై వైసీపీ ఫిర్యాదు
అన్నమయ్య: తమను, మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని మదనపల్లెలో వైసీపీ నాయకులు నిరనస తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఏబీఎన్ అంటే ఆల్ టైం బోగస్ న్యూస్ అని విమర్శించారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. రాజకీయాల కోసం మహిళలను కించపరచడం తగదన్నారు.