'జిల్లా యంత్రాంగానికి అభినందనలు'
TPT: తుఫాను సహాయక చర్యల్లో సమిష్టిగా కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ వేంకటేశ్వర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. రానున్న రెండు మాసాల్లో కూడా వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న PGRS కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.