హోటల్‌లో అగ్నిప్రమాదం
GDWL: మల్దకల్ మండలంలోని ఎల్కూర్ గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని ఈదన్న హోటల్‌లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.