'దిత్వా తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
TPT: దిత్వా తుఫాన్ సంధర్భంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లాలో నవంబర్ 29, 30, డిసెంబర్ 1వ తేదీలలో గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.