బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నరేష్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నరేష్

WGL: BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వరంగల్‌కు చెందిన సిద్ధం నరేష్ పటేల్ నియమాకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షలు రాంచందర్ రావు నరేష్‌కు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. తన నియమాకానికి సహకరించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ BJP పార్టీ ఇంఛార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు కృతఙ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.