ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న నాయకులు

ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్న నాయకులు

BDK: దమ్మపేట మండలం గొల్లగూడెం గ్రామంలో జిల్లా వ్యాప్త ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆదివారం బీజేపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు, తంబళ్ల రవి, ఎమ్మార్పీఎస్ కాంతారావు నాయకులు క్రీడాకారులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఓఆర్‌ఎస్ డ్రింక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.