VIDEO: పంట కాలువలలో తూడు తొలగించాలి: ఎమ్మెల్యే
తూ.గో జిల్లాలో ఉన్న పంట కాలువలలో సాగునీటి ప్రవాహానికి అడ్డుపడుతున్న తూడు, ఇతర చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో అన్నారు. కాలువలలో పూడిక తీత లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. దీనిపై ఇరిగేషన్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.