ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ క్రీడా పోటీలు
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వార్షికోత్సవ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ బి. సుజాత ప్రారంభించారు. క్రీడలు శారీరిక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.