మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఏలూరు 1 టౌన్ పరిధిలో బాలికల ఉన్నత పాఠశాల వద్ద మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వ్యక్తిని శక్తి టీమ్స్ సభ్యులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శక్తి టీమ్ సీఐ సుబ్బారావు హెచ్చరించారు. ఎటువంటి సమస్య ఉన్న వెంటనే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.