మండలాలు కడపలోనే ఉంచాలని నిరసన దీక్షలు
KDP: సిద్ధవటం,ఒంటిమిట్ట మండలాలు కడపలోనే ఉంచాలని సర్పంచ్ ప్రతినిధి తుర్రా ప్రతాప్ నాయుడు అన్నారు. సిద్దవటం మండలంలోని భాకరాపేటలో ఇవాళ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్ధవటం మండలం అతి చేరువలో ఉన్న కడప కాదని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటిలో మండలాలను కలపడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.