ప్రభుత్వం మారినా నేతల ఫోటోలు, రంగులు మారలేదు

ప్రభుత్వం మారినా నేతల ఫోటోలు, రంగులు మారలేదు

కృష్ణా: ఉయ్యూరు నగర పంచాయతీ నూతన షాదీ ఖానా దగ్గరలో డాక్టర్ వైఎస్‌ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాజీ సీఎం జగన్ బొమ్మను తొలగించలేదని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన జీవో ప్రకారం సీఎం, డీప్యూటీ సీఎం ఫోటోలు ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోవాలన్నారు.