రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి

రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి

ప్రకాశం: జిల్లాలోని సింగరాయకొండ గ్రామానికి చెందిన షేక్ కాలీషా ELR జిల్లా బుట్టాయగూడెం(M) రెడ్డిగణపవరంలో పొగాకు గొట్టాల వ్యాపారం చేసేవాడు. అయితే అతడు ఫిబ్రవరి 22న దర్భగూడెంలోని తిరునాళ్లకు ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.