అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బునేడ్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 19 బస్తాల (ఏడు క్వింటాళ్ల) పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.