రూరల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీసీపీ
పెద్దపల్లి డీసీపీ బీ. రామ్ రెడ్డి, ఏసీపీ జీ. కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్‌తో కలిసి పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషనన్ను సందర్శించారు. స్టేషన్ పరిస్థితులు, సిబ్బంది పనితీరు, కేసుల వివరాలు పరిశీలించారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు, నేర నియంత్రణపై SI మల్లేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల పర్యటనలు పెంచాలన్నారు.