BREAKING: కూలిన కలెక్టరేట్ భవనం పైకప్పు! (వీడియో)

ADB: జిల్లా కలెక్టరేట్ భవనంలోని ఓ పురాతన గది పైకప్పు కూలిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాం కాలం నాటి ఈ భవనం శిథిలావస్థకు చేరింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం భారీ వర్షానికి ఒక గది పైకప్పు కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.