యూరియా కోసం.. పాసు పుస్తకాల నిరీక్షణ

WGL: రోజురోజుకు పెరుగుతున్న యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, యూరియా కోసం నిరీక్షిస్తున్న రైతులు వినూత్న రీతిలో క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా పర్వతగిరిలోని రైతు వేదిక వద్ద రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలను క్యూలైన్లలో పెట్టి, యూరియా పంపిణీ కోసం వేచి చూడటం కనిపించింది. ఈ నిరీక్షణ చర్చనియాంశంగా మారింది.