ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

NZB: కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకొని కొనియాడారు.