'వాహనదారులు నిబంధనలు పాటించాలి'

GNTR: వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎస్సై ప్రకాశరావు, కరిముల్లా సూచించారు. చెంచుపేటలో శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. రాష్ డ్రైవింగ్‌తో పాటు, సరైన పత్రాలు లేని టూ వీలర్స్‌ను గుర్తించి కేసులు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురి వద్ద నుంచి అపరాధ రుసుము వసూలు చేశారు.