మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంగళవారం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.