పాలకుర్తిలో ఘనంగా 891వ బసవ జయంతి వేడుకలు

WGL: సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త, ఆదర్శ సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన పునీతుడు బసవేశ్వరుడని శ్రీ శైవ మహా పీఠం వరంగల్ శాఖ అధ్యక్షులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భండారు ఉమామహేశ్వర రావు అన్నారు. శుక్రవారం బసవేశ్వరుని 891వ జయంతిని పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పరిసరాలలోని సోమనాథ స్మృతి వనంలో ఘనంగా నిర్వహించారు.