మహిళలు బాలికల భద్రతకు ప్రాధాన్యత

మహిళలు బాలికల భద్రతకు ప్రాధాన్యత

AKP: రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి అన్నారు. అనకాపల్లి మండలం కొత్తూరులో బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలపై హింసను నిరోధించేందుకు ప్రభుత్వం పలు చట్టాలు చేసిందన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు సహకరించాలన్నారు. బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయని అన్నారు.