కల్వకుర్తిలో రేపు ఎమ్మెల్యే పర్యటన

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 8:30 కడ్తాల్ మండలంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. అక్కడి నుంచి కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారన్నారు.