రుద్రూర్ లో డీజే యజమానుల బైండోవర్

NZB: రుద్రూర్ మండలంలో గణపతి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనంలో డీజేలను పూర్తిగా నిషేధించినట్లు SI ఆంజనేయులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంగళవారం మండలంలోని డీజే యజమానులందరినీ తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిమజ్జనంలో డీజేలు వాడితే, కేసు నమోదు చేసి డీజేలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.