విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన మంత్రి
NLG: NG కళాశాలలో తరచుగా ఏర్పడుతున్న విద్యుత్ సమస్యకు మంత్రి KVR శాశ్వత పరిష్కారం చూపారు. ఈ సమస్యను ప్రిన్సిపల్ ఉపేందర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అంతరాయాలు తొలగేలా కళాశాలకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయించారు. దీంతో విద్యార్థులు, బోధక సిబ్బంది ఇబ్బందులు తొలగిపోయాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.