VIDEO: జనగాంలో ఆర్టీసీ సమ్మె.. 122 బస్సులు నిలిపివేత
జనగాం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమ్మె కారణంగా బుధవారం జనగామ బస్ డిపోలో 122 బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్మికులు డిపో ముందు నేలపై కూర్చుని నిరసన ధర్నా నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.