VIDEO: తుంగభద్రలో చెత్త దహనం కలకలం
NGKL: తుంగభద్ర నది ఒడ్డున ఏర్పాటు చేసిన తాత్కాలిక డంపింగ్ యార్డులోని చెత్తకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలో కలిసి నీరు కలుషితమవుతోంది. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా అయినా అధికారులు స్పందించి నది, పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.