జనవాణిలో ప్రజల అర్జీలు స్వీకరణ
GNTR: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను వినిపించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సంబంధిత సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.