NTR కారణజన్ముడు: తులసి రెడ్డి
కడప: స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణజన్ముడు, యుగపురుషుడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డా.తులసి రెడ్డి అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతిని తులసి రెడ్డి దంపతులు ఆదివారం వేంపల్లిలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర వినీల ఆకాశంలో, రాజకీయ రంగంలో ఆయన ఒక ధ్రువతార అన్నారు.