మావుళ్ళమ్మకి 20 గ్రాముల బంగారం అందజేత

మావుళ్ళమ్మకి 20 గ్రాముల బంగారం అందజేత

W.G భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి దాతలు శుక్రవారం 20 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు. జగన్నాధపురం ఎంపీటీసీ మంతెన పాండు రంగరాజు, సాయి మౌనిక దంపతులు, వారి కుటుంబ సభ్యులు 20 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేశ్‌కు ఇచ్చారు. త్వరలోనే అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామన్నారు.