VIDEO: బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో మాజీ మంత్రి
MULG: ములుగు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఆదివారం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మణ్ బాబు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ఎండగడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.