పోలమాంబ జాతరలో పాల్గొన్న వీఎంఆర్‌డీఏ ఛైర్మన్
విశాఖలోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.