అర్ధరాత్రి దొంగల బీభత్సం
SDPT: వట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు దూసరి మనోహర్ గౌడ్ కోళ్ల ఫారంలో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఫారం వద్ద ఉన్న సింగిల్ ఫేస్ మోటారుతో పాటు విద్యుత్ కేబుల్ను కత్తిరించి ఎత్తుకెళ్లారు. గ్రామ శివార్లలో దొంగలు హల్చల్ చేస్తున్నారని పోలీసులు గస్తీ పెంచి తమకు రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.