గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

MNCL: తాండూర్ మండలం మాదారంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం అరెస్టు చేసినట్లు CI దేవయ్య తెలిపారు. గోలేటికి చెందిన అడ్డూరి జగన్, జంగంపల్లి ప్రశాంత్ గంజాయి తీసుకువస్తున్నట్లు సమాచారం తెలిసిందన్నారు. SI సౌజన్య సిబ్బందితో వెళ్లి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.