డయల్ 100తో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
సత్యసాయి: కుటుంబ సభ్యుల మందలింపుతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని సోమందేపల్లి పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. కొత్తపల్లికి చెందిన గణేష్ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లగా, అతని తల్లి డయల్ 100కు సమాచారం అందించారు. ఎస్సై సుధాకర్ యాదవ్ బృందం మెరుపువేగంతో గాలించి, రంగేపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని సురక్షితంగా పట్టుకున్నారు.