దోమలు.. బాబోయ్ దోమలు

దోమలు.. బాబోయ్ దోమలు

VKB: ధారూర్ మండల కేంద్రంలో దోమల విజృంభణ పెరిగిపోయింది. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను కుడుతూ రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దోమల వల్ల రోగాల బారినపడే అవకాశం ఉందని గ్రామంలో డ్రైనేజీ కాలువల వద్ద పిచికారీ, ఫాగింగ్ చేసి, దోమలను అరికట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.