ఉన్నఫలంగా మద్యం మానేస్తున్నారా?

ఉన్నఫలంగా మద్యం మానేస్తున్నారా?

మద్యం ఎంత పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే. దీంతో కొందరు క్రమంగా మద్యాన్ని పక్కన పెడిటే, మరికొందరు ఉన్నట్లుండి మానేస్తుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఉన్నఫలంగా మద్యం మానేస్తే మానసిక సమస్యలు, టెన్షన్, మతిమరుపు, అయోమయానికి లోనవుతారని అంటున్నారు. దీన్ని విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారని, కాబట్టి దశలవారీగా మానేయాలని సూచిస్తున్నారు.