బావిలో దూకి యువకుడు మృతి
GNTR: మంగళగిరి పరిధిలోని యర్రబాలెంలో అబ్బాస్ (24) అనే యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో ఇటీవల జరిగిన వివాదం కారణంగా మనస్తాపానికి గురై అబ్బాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధువు భార్య రెండో వివాహం చేసుకోవడం ఈ వివాదానికి కారణమని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఫైర్ అధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మృతదేహాన్ని వెలికితీశారు.