VIDEO: కనుల పండువగా ఫాతిమామాత ఉత్సవాలు
HNK: కాజీపేట ఫాతిమా నగర్‌లోని ఫాతిమా క్యాథడ్రల్ చర్చిలో ఫాతిమా మాత ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన ఫాతిమా రథాన్ని వరంగల్ క్యాథలిక్ పరిపాలనాధికారి విజయపాల్ రెడ్డి పావురాలు, బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. మత గురువులు, ప్రజాప్రతినిధులతో కలిసి రథాన్ని లాగగా, క్యాథలికులు కొవ్వొత్తులతో ఫాతిమా మాతను ప్రార్థించారు.