మామిడి తోటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

MLG: వెంకటాపూర్ మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో తిరుపతిరావు అనే రైతుకు చెందిన మామిడితోటకు మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 7ఎకరాల విస్తీర్ణంలో సుమారు 2 వేల మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయని రైతు వాపోయాడు. రూ. 30 లక్షల వరకు పంట నష్టం జరిగిందని రైతు తిరుపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.