13 లేదా 14 తేదీల్లో మేడారంకు సీఎం

MLG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13 లేదా 14 తేదీల్లో మేడారం పర్యటనకు రానున్నట్లు ములుగు జిల్లా ప్రజాప్రతినిధులు తెలిపారు. పర్యటనలో భాగంగా మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారన్నారు. మేడారం మహా జాతరలోపే పనులు పూర్తిచేయాలని రేవంత్ అధికారులకు సూచనలు జారీచేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.