VIDEO: బైకులు ఢీ..నలుగురికి తీవ్ర గాయాలు..!
అన్నమయ్య: కలికిరి మండలం కలికిరి- కందూరు మార్గంలో సామిగుంటవారిపల్లి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో అగ్ని ప్రమాదం సంభవించి వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.