VIDEO: 'ఘనంగా దీన్ దయాల్ వర్ధంతి వేడుకలు'

VZM: గజపతినగరం పట్టణంలో మంగళవారం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీని ఆయన విజయపథంలో నడిపించారని చెప్పారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మేటి కోటి భాస్కరరావు, బీజేపీ నేతలు ఆరిశెట్టి ఏడుకొండలు, మండపాక భారతి, ఆచారనాయుడు మాధవ పాల్గొన్నారు.