'రంజాన్ కానుకగా రూ.45 కోట్లు విడుదల'
KRNL: రంజాన్ సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌ల గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం రూ.45 కోట్లు విడుదల చేసింది. ఏమ్మింగనూరు ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలు సీఎం చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. 10 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. గత బకాయిలను ఒకేసారి చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.