కేసారంలో కేంద్రీయ విద్యాలయ స్థల పరిశీలన

కేసారంలో కేంద్రీయ విద్యాలయ స్థల పరిశీలన

SRPT: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయం కోసం కేసారంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర విద్యాలయ సంఘటన్ ఉన్నతాధికారుల బృందంతో కలిసి భూమి లభ్యతను అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సంతోష్, ఆర్డీవో వేణుమాధవ్, తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.